under - 16 cricket
-
చరిత్ర సృష్టించిన కర్ణాటక క్రికెటర్.. వన్డేల్లో క్వాడ్రాపుల్ సెంచరీ, రోహిత్ రికార్డు బద్ధలు
50 ఓవర్ల ఫార్మాట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్ణాటకలోని షిమోగలో జరిగిన అంతర్ జిల్లా అండర్-16 టోర్నీ ఓ అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. టోర్నీలో భాగంగా భద్రావతి-సాగర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ యువ ఆటగాడు ఏకంగా క్వాడ్రాపుల్ సెంచరీ (నాలుగు వందల పరుగులు) బాదాడు. సాగర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తన్మయ్ మంజునాథ్ 165 బంతుల్లో.. 48 ఫోర్లు, 24 సిక్సర్ల సాయంతో 407 పరుగులు చేశాడు. New #worldrecord set by 16 year old boy Tanmay Manjunath frm Sagar, Shivamogga. He scored 407 runs in 165 balls against Bhadravathi NTCC at #KSCA under 16, 50 overs inter district tournament. He had hit 48 boundaries & 24 Sixes. He was representing Sagar #Cricket club. 1/2 pic.twitter.com/BK12x3xXo1 — Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) November 12, 2022 ఫలితంగా సాగర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 583 పరుగులు చేసింది. అనంతరం అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భద్రావతి టీమ్ కేవలం 73 పరుగులకే కుప్పకూలి అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగిన తన్మయ్.. యాభై ఓవర్ల ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ హండ్రెడ్స్ తన ఖాతాలో వేసుకున్న హిట్‌మ్యాన్.. శ్రీలంకపై 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 264 పరుగులు చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్‌గా కొనసాగుతుంది. లిస్ట్-ఏ క్రికెట్ కూడా కలుపుకుంటే సర్రే-గ్లామోర్గన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏడీ బ్రౌన్ 268 పరుగులు సాధించాడు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
అండర్ - 16 క్రికెట్ ఫైనల్స్‌లో అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ - 16 టెస్టు క్రికెట్ టోర్నీ ఫైనల్‌కు అనంత జట్టు చేరింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తూర్పు గోదావరి జట్టుతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ లీడ్‌తో ఫైనల్లో తన బెర్తును ఖరారు చేసుకుంది. మ్యాచ్ చివరిరోజైన ఆదివారం తూర్పుగోదావరి జట్టు 9 వికెట్లకు 111 పరుగులతో ఆట ప్రారంభించింది. రెండు పరుగులు చేస్తూనే వికెట్ పడిపోవడంతో 113 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అనంత బౌలర్లు కామిల్ 5, మీరజ్‌కుమార్ 4, గణేష్‌రెడ్డి 1 వికెట్ సాధించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసింది. జట్టులో యోగానంద 75, గురురాఘవేంద్ర 63, అర్జున్ టెండూల్కర్ 42, మహేంద్రరెడ్డి 39 పరుగులు చేశారు. ఈ నెల 5 నుంచి 7 వరకు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో విశాఖపట్టణం - అనంతపురం జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. టోర్నీలో మెరిసిన యోగానంద, కామిల్, అర్జున్ టెండూల్కర్ ఈ టోర్నీలో అనంత జట్టు ఫైనల్‌కు చేరడంలో యోగానంద, కామిల్ల పాత్ర కీలకమైనది. యోగానంద మెరుగైన కెప్టెన్సీతోపాటు తన పదునైన ఆటతీరుతో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో సఫలమయ్యాడు. ఈ మూడు రోజుల టెస్ట్ టోర్నీలో ఇప్పటివరకు 563 పరుగులు చేశాడు. కామిల్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. టోర్నీలో ఇప్పటివరకు 35 వికెట్లు తీశాడు. 292 పరుగులు సా«ధించాడు. టోర్నీలో యోగానందకు మంచి సపోర్ట్ అందించిన మరో బ్యాట్స్‌మెన్ అర్జున్ టెండూల్కర్ 349 పరుగులు సాధించడం కూడా జట్టుకు చాలా ఉపయోగపడింది.