ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్‌ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్‌పై కేసు నమోదు చేసి జువెనైల్‌లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.
కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్‌లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.
ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment