Juvainal court
-
Pune: బెయిల్ ఇస్తున్నాం.. ఈ షరతులు పాటించాల్సిందే
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ బాలుడు పోర్షే కారుతో బైక్‌ను ఢికొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎరవాడ పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన మైనర్‌పై కేసు నమోదు చేసి జువెనైల్‌లో కోర్టులో ప్రవేశపెట్టారు. 17 ఏళ్ల ఆ బాలుడి తరఫు న్యాయవాది బెయిల్ కోరగా.. పలు షురతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాము విధించే షరతులను తప్పనిసరిగా పాటించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు విధించిన షరతులు.. ‘ట్రాఫిక్ పోలీసుతో 15 రోజులు పని చేయాలి. మానసిక పరివర్తనకు సైకియాట్రిస్ట్ వద్ద చికిత్స చేయించుకోవాలి. ‘రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కార మార్గాలు’అనే టాపిక్ మీద 300 పదాలలో వ్యాసం రాయాలి. డి- అడిక్షన్ సెంటర్లో పునరాసం కోరాలి. ట్రాఫిక్ రూల్స్ చదవి జువైనల్ జస్టిస్ బోర్డుకు ప్రజంటేషన్ ఇవ్వాలి. రోడ్డు ప్రమాద బాధితులకు భవిష్యత్తులో అండగా ఉండాలి’అని జువైనల్ కోర్టు మైనర్ బాలుడికి షరతులు విధించింది.ప్రముఖ బిల్డర్ కుమారుడైన మైనర్ ఆదివారం ఉదయం కోరేగావ్ పార్క్ వద్ద వేగంగా పోర్షే కారును నడుతూ.. బైక్‌ను ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో అనిస్ దుధియా ,అశ్విని కోస్టా మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
టెన్త్ విద్యార్థినిపై బాలుడి లైంగికదాడి
లంగర్‌హౌస్: బాలికను కిడ్నాపై చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడో బాలుడు. నిందితుడిని అరెస్టు జువైనల్ కోర్టుకు తరలించారు. లంగర్‌హౌస్ ఎస్సై మహమ్మద్ జాహెద్ తెలిపిన వివరాల ప్రకారం... టోలిచౌకి పారమౌంట్ కాలనీకి చెందిన బాలిక (13) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గోల్కొండ ప్రాంతంలో నివాసముండే ఓ బాలుడు (17) టోలిచౌకిలోని మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం తండ్రి సెల్‌ఫోన్ రీఛార్జి చేయించడానికి బాలిక ఆ మొబైల్ దుకాణానికి వెళ్లింది. అప్పటి నుంచీ బాలుడు ఆమె వెంటపడి ప్రేమించాలని వేధిస్తున్నాడు. వారం క్రితం బాలిక తండ్రి అనారోగ్యానికి గురికావడంతో నానల్‌నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. తండ్రిని చూడటానికి ఓ రోజుల బాలికి ఆసుపత్రికి వెళ్లడం బాలుడు గమనించాడు. శనివారం ఆసుపత్రి వద్ద కాపుకాసి బాలికను ఆమె తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ మాటలు కలిపాడు. ఆమెకు మాయమాటలు చెప్పి శంకర్పల్లి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడి ఇంట్లో ఉంచి లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించి, సోమవారం ఉదయం బాలికను టోలిచౌకిలో వదిలి వెళ్లాడు. బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు చెప్పగా.. లంగర్‌హౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని జువైనల్ జస్టిస్ కోర్టుకు తరలించారు.