సాక్షి, తెనాలి: సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారు. స్కిల్ స్కాంపై ఎక్కడా మాట్లాడకూడదని కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. అయితే, రూల్స్‌ను ఉల్లంఘిస్తూ తెనాలిలో స్కిల్ స్కాంపై చంద్రబాబు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘లీగల్‌గా, టెక్నికల్ గా తప్పు చేయకున్నా జైల్లో పెట్టారంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. అరెస్ట్ చేసినందుకు సీఐడీ పోలీసులను, రిమాండ్‌కు పంపినందుకు కోర్టును తప్పుబట్టారు.
కేసు గురించి ప్రసావించ వద్దంటూ సుప్రీంకోర్టు నిబంధన విధించగా, అయినా సరే, కేసు గురించి చంద్రబాబు బహిరంగంగా మాట్లాడారు. దీనిబట్టి కోర్టులన్నా, చట్టాలన్నా చంద్రబాబుకు గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఇది కచ్చితంగా బెయిల్ నిబంధన ఉల్లంఘనేనని, బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదని న్యాయ నిపుణులు అంటున్నారు.
కాగా, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. 17ఏ వ్యవహారంపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని హరీష్ సాల్వే కోరారు. కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నాం, వాయిదా వేయకుంటే విచారణ తేదీ చెప్పాలని విజ్ఞప్తి చేశారు. 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని హారీష్ సాల్వే ప్రస్తావించారు. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణను జనవరి మూడో వారంలో చేపడతామన్న జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం.. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!
Comments
Please login to add a commentAdd a comment