నల్లధనాన్ని వెలికితీయాలి: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: నల్లధనం ఏ రూపంలో ఉన్నా వెలికితీయాలని, దీనివల్ల దేశ ఉత్పాదకశక్తి పెరుగుతుందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. జేఏసీ నేతలతో కలసి బుధవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. కేవలం పెద్దనోట్ల రూపంలోనే నల్లధనం ఉందని అనుకోవడం సరికాద న్నారు. బంగారం, భూములు, షేర్లు రూపంలో కూడా చాలా నల్లధనం ఉంద న్నారు. మన జాతీయ ఉత్పత్తిలో 30 శాతం ఉందని అర్థిక నిపుణులు చెబుతున్నారని అన్నారు. నల్లధనాన్ని పూర్తిగా వెలికితీస్తే ఉత్పాదకశక్తి పెరగడానికి దోహదం చేస్తుందన్నారు. గతంలో నోట్ల రద్దు జరిగినా సామాన్య ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడలేదన్నారు.రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయానికి ముందుగానే ప్రజలను సిద్ధం చేస్తే బాగుండేదన్నారు.
సామాన్య ప్రజలకు అందేవిధంగా కరెన్సీ ఉత్పత్తి, సరఫరాను పెంచాలని కోరారు. పోస్టాఫీసు ల్లోనూ కరెన్సీ సరఫరా ను పెంచా లని కోరారు. 100, 50 నోట్లను విస్తృతంగా విడుదల చేయాలన్నా రు. గ్రామీణ స్థారుులో ఇంకా చాలామందికి బ్యాంకు ఖాతాలు లేవన్నారు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తన కుమార్తె పెళ్లికి 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అవి ఎలా వచ్చాయో తేల్చాలన్నారు. సామాన్య ప్రజలు, పేదలు చిల్లరకోసం బ్యాంకుల దగ్గర నిలబడి ఉంటే బడాబాబుల బ్యాంకు రుణాలను మాఫీ చేయడం దారుణమన్నారు. కేవలం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడపాలనే ఆలోచన మంచిది కాదన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను అవలంభించాలని సూచించారు.