న్యూఢిల్లీ : ఓఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కాగా మూడేళ్లుగా దర్యాప్తు పూర్తి చేయకుండా నిందితులను ఎంత కాలం జైల్లో ఉంచుతారని సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
శిక్ష ఖరారు కాకుండానే దర్యాప్తు దశలో ఇలా జైల్లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సీబీఐ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గాలి జనార్దన్ రెడ్డి అన్ని కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.