మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ మహోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు అన్నారు.
బళ్లారి : మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ మహోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు అన్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణి తనకు కూడా కుమార్తెలాంటిదన్నారు. ఆమె పెళ్లికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ పెళ్లికి పార్టీలోని జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నామని, వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం అధునాత పరిజ‍్ఞానంతో తయారు చేశామన్నారు.
తమ స్థాయికి తగ్గట్టుగా మధ్య తరగతి తరహాలోనే వివాహం జరుగుతందని శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి పెదనాన్న సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పెళ్లి ఏర్పాట్లు బళ్లారిలోనూ జరుగుతున్నాయన్నారు. జనార్దన్ రెడ్డి నవంబర్ 1న ఇక్కడికి వస్తారని, 10వ తేదీన పెళ్లికూతురిని చేసే కార్యక్రమం చేస్తామన్నారు. తదుపరి మిగిలిన అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే నిర్వహిస్తామన్నారు. బ్రాహ్మణి వివాహం నవంబర్ 16న రాజీవ్ రెడ్డితో బెంగళూరులో జరగనుంది. (చదవండి ...గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లికి వెరైటీ ఇన్విటేషన్)