
తిరుమల: అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీని ఎప్పటికీ ఏ పార్టీలోనూ విలీనం చేయబోమని స్పష్టం చేశారు. 2028లో అధికారం సాధించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment