గాలి జనార్దనరెడ్డి బెయిలు స్కామ్‌లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించిన మాజీ జడ్జి ప్రభాకరరావు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
హైదరాబాద్: గాలి జనార్దనరెడ్డి బెయిల్ స్కామ్‌లో నిందితుడిగా జైలుశిక్ష అనుభవించిన మాజీ జడ్జి ప్రభాకరరావు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. తీవ్ర మనస్తాపంతో కుమిలిపోతున్న ప్రభాకరరావు హైదరాబాద్ నగరంలోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్వగృహంలో మృతిచెందారు.
గాలి జనార్దనరెడ్డి బెయిలు కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆయన బాధపడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.