
బనశంకరి: చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ నియోజకవర్గ ఎమ్మెల్యే గూళిహట్టి శేఖర్‌కు బీజేపీ టికెట్ నిరాకరించడంతో అసంతృప్తికి గురైన ఆయన మంగళవారం రాత్రి కేకేపీపీ సంస్దాపకుడు గాలి జనార్దనరెడ్డిని కలిశారు.
బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై గూళిహట్టి శేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల మొదటి జాబితాలో టికెట్ చేజారడంతో రాత్రికి రాత్రి బెంగళూరులోని పారిజాత నివాసంలో జనార్దనరెడ్డితో చర్చలు జరిపారు. దీంతో గూళిహట్టి శేఖర్ హొసదుర్గ నుంచి కేఆర్‌పీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.