
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బళ్లారి, అనంతపురం, కడప వెళ్లేందుకు అత్యున్నత న్యాయస్థానం అతనికి అనుమతినిచ్చింది. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ షరతులు ఎక్కడా ఉల్లంఘించలేదన్న కోర్టు.. స్థానిక జిల్లా ఎస్పీకి ముందస్తు సమాచారం అందించి సదరు ప్రాంతాలకు వెళ్లొచ్చని పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ మూడో వారానికి వాయిదా వేసింది.
చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment