తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరే ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ అకౌంట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు.
సాక్షి, బెంగళూరు: తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరే ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోనూ అకౌంట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. ఎవరో తన పేరు మీద ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి అనుచిత సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై బుధవారం తనఅనుచరుడు వి.శివకుమార్ ద్వారా సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగేలా సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న వారిని శిక్షించాలని ఫిర్యాదులో కోరారు.