దర్శకుడి పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్
కోయంబత్తూరు: సోషల్ మీడియాలో ప్రముఖుల పేరిట నకిలీ ఖాతా తెరిచే మోసాలకు పాల్పడే సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా బాధితుల జాబితాలో తమిళ దర్శకుడు హరి చేరారు.
హరి పేరిట కొందరు వ్యక్తులు ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచారు. హరి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరుప్రతిష్టలను పాడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పేరును ఇతర అవసరాల కోసం దుర్వియోగం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు ఫేస్బుక్ అకౌంట్ లేదని హరి స్పష్టం చేశారు. ఓ సినిమా షూటింగ్ కోసం ఆయన కోయంబత్తూరు వచ్చారు. సూర్య హీరోగా ఘనవిజయం సాధించిన సింగమ్, సింగమ్ 2 చిత్రాలకు హరి దర్శకత్వం వహించారు.