ఫేస్బుక్ ప్రేమలీల.. చివరికిలా.. | police hunt for facebook cheater who marries teen girl by fake promises | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ ప్రేమలీల.. చివరికిలా..

Published Mon, Nov 16 2015 8:29 PM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

ఫేస్బుక్ ప్రేమలీల.. చివరికిలా.. - Sakshi

ఫేస్బుక్ ప్రేమలీల.. చివరికిలా..

హైదరాబాద్: ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యారు. కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమ్మాయి డిగ్రీ విద్యార్థిని. పెద్దలను ఎదిరించి పెళ్లితో ఒక్కటై హైదరాబాద్ లో కాపురం పెట్టారు. సీన్ కట్ చేస్తే.. సదరు సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కనీసం టెన్త్ కూడా పాస్ కాలేదని తేలింది. రెండు అబార్షన్ల తర్వాత మూడోసారి కడుపుచేసి పారిపోయిన ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..

కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన చావలి ఆనంద్‌బాబు అలియాస్ అనిల్(26) పదోతరగతి కూడా పాస్ కాకుండా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నానని అందరికీ చెప్పుకునేవాడు. గత ఏడాది ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా యువతి(19)ని కూడా అలానే నమ్మించాడు. వారిద్దరి మధ్య పరిచయం పెరిగి పెళ్లికి దారితీసింది. హైదరాబాద్ లోని శ్రీకృష్ణనగర్ లో గది అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు. ఆనంద్ ఆవారా అని ఆలస్యంగా తెలుసుకున్నయువతి ఎలాగోలా కలిసే ఉండాలని నిశ్చయించుకుంది.

ఈ క్రమంలో యువతి మూడుసార్లు గర్భం దాల్చింది. మొదటిసారి అనిల్ అబార్షన్ చేయించగా, రెండోసారి పురిట్లోనే శిశువు చనిపోయాడు. ప్రస్తుతం యువతి మూడోసారి గర్భవతి. కాగా, రెండు వారాల కిందట, ఆనంద్.. భార్యకు సమాచారం ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న యువతి.. సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఆనంద్ పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement