'ఆ ఫేస్ బుక్ అకౌంట్ నాది కాదు'
బెంగళూరు: తనకు ఫేస్‌బుక్‌తో పాటు మరే ఇతర సామాజిక అనుసంధానాల వేదిక (సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్)ల్లోనూ అకౌంట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎవరో తన పేరు మీద ఫేస్‌బుక్‌లో అకౌంట్‌ను ఓపెన్ చేసి అసంబద్ధ సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై బుధవారం తన అనుచరుడు వి.శివకుమార్ ద్వారా సీఐడీకి ఫిర్యాదు చేశారు. తన మర్యాదకు భంగం కలిగేలా ఫేస్‌బుక్‌లో సమాచారాన్ని పోస్ట్ చేస్తున్న దుండగున్ని గుర్తించి శిక్షించాలని ఆ ఫిర్యాదులో ఆయన కోరారు.