
సాక్షి,బళ్లారి: మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పుట్‌బాల్ గుర్తుకు ఓటు వేసి నగరాభివృద్ధికి సహకరించాలని కేఆర్‌పీపీ అభ్యర్థి గాలి లక్ష్మీఅరుణ పేర్కొన్నారు. ఆమె గురువారం నగరంలోని 18, 21వ వార్డుల్లో పుట్‌బాల్ చేతపట్టుకుని మండుటెండల్లో తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేశారు. ఒంటిరి మహిళను బరిలో ఉన్నానని, జనమే తనకు అండగా నిలవాలని కోరారు. ఆమె వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.