గాలి విడుదలకు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో బెయిల్ లభించిన గాలి జనార్దన్‌రెడ్డి విడుదలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. బెయిల్ ఉత్తర్వులను సీబీఐ కోర్టు సిబ్బంది గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు అధికారులకు అందజేశారు. వాటిని ఫ్యాక్స్ ద్వారా కర్ణాటక జైలు అధికారులకు పంపినట్లు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ బి. సైదయ్య తెలిపారు. కర్ణాటక జై ల్లో గాలి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.