బళ్లారి: కర్నాటకలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీని స్థాపించిన గాలి జనార్థన్‌రెడ్డి ఒక బ్రాండ్ అని అంటున్నారు ఆయన భార్య అరుణ లక్ష్మి. గత మూడు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నామని, ఇప్పుడు కొత్త పార్టీతో ప్రజల ముందుకు వచ్చామన్నారు. తమ రాజకీయ జీవితంలో కర్నాటక ప్రజలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, అది చెబుతూ వెళ్తే ఒక రోజు సరిపోదన్నారు జనార్థన్‌రెడ్డి భార్య అరుణ.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’తో మాట్లాడిన అరుణ.. ‘ నేను ఏ ఇంటికి వెళ్లినా ఒక ఆడపడుచులా స్వాగతిస్తున్నారు. బావ సోమశేఖర్‌రెడ్డి తమ ప్రత్యర్థిగా బరిలో ఉన్నప్పటికీ, గాలి జనార్థన్‌రెడ్డికి బళ్లారి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. బళ్లారిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. బళ్లారి జనంలో గాలి జనార్థన్‌రెడ్డి అంటే ఒక బ్రాండ్ అని తెలుసు. బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టాం. మేము 12 ఏళ్లు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నాం. జనానికి మంచి పనులు చేస్తూ రాజకీయంగా దూరంగా ఉండటం సరికాదనే భావించే పార్టీ పెట్టాం. మనకు భగవంతుడు ఇచ్చేది ఒకటే జీవితమని, దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మరింత సేవ చేయాలనుకుంటున్నాం’ అని తెలిపారు. బళ్లారిలో కళ్యాణ రాజ్యప్రగతి పక్ష పార్టీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి భార్య అరుణ పోటీ చేస్తుండగా, బీజేపీ తరఫున గాలి జనార్థన్‌రెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment