ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేదు: మాజీ మంత్రి
బెంగళూరు: బీజేపీ కోసం రాష్ట్రంలో పర్యటించి శ్రమిస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలో వినాయక ఆలయంలో పూజలు నిర్వహించడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఎన్నికల పట్ల ఆసక్తి లేదని.. అయినా పార్టీ అప్పజెప్పే బాధ్యతను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి తెలిపారు.
రాజకీయాల గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టం లేదని మళ్లీ వచ్చినపుడు ఆ అంశాలపై మాట్లాడుతానని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీపీ వెంకటమునియప్ప, మాజీ అధ్యక్షుడు ఎట్టికోడ్డి కృష్ణారెడ్డి, తదితర కీలకనేతలు గాలి జనార్థన్ రెడ్డి తో పాటుగా ఉన్నారు. ఆయన గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యహరించడం లేదన్న విషయం తెలిసిందే.