
Former Minister Gali Janardhan Reddy Son Kireeti Reddy To Debut In Films: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు. కన్నడలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు కిరీటీ రెడ్డి. కొడుకును హీరోగా చేసేందుకు గాలి జనార్థన్ కిరీటి రెడ్డికి నటన, డ్యాన్స్, ఫైటింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడట. కాగా రాధాకృష్ణ కన్నడలో మాయాబజార్ మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరక్కించబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇక ఈ మూవీ గురించి డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘నటుడు కావాలన్నది కిరీటి కల.
చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే..
ఇప్పటికే అతడు యాక్టింగ్, డ్యాన్స్, ఫైటింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 'జాకీ' చిత్రం స్ఫూర్తితోనే కిరీటి సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు’ అని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో లెజెండ్, యుద్ధం శరణం వంటి చిత్రాలను రూపొందించిన నిర్మాత సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కాగా కర్ణాటకకు చెందిన పలువురు రాజకీయ నాయకుల వారసులు సినిమాల్లోకి వచ్చిన సత్తా చాటుతున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్‌లు ఇప్పటికే హీరోలుగా పరిచమయ్యారు.
చదవండి: ‘ఆచార్య’ మూవీ టీంకు షాక్, మెగాస్టార్ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు