
బళ్లారి: బీజేపీ కీలక నేత, వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నా ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. గాలి తన స్వస్థలం బళ్లారికి వెళ్లకూడదంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఓటు వేసేందుకు గాలి ప్రత్యేకంగా అనుమతి కోరారా, లేదా అన్నది తెలియాల్సిఉంది.
నాన్నతో కలిసి ఓటేద్దామనుకున్నా: మరోవైపు గాలి కుటుంబీకులంతా ఓట్లు వేశారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న జనార్ధన్‌రెడ్డి కూతురు బ్రాహ్మణి మీడియాతో మాట్లాడారు. ‘‘ఫస్ట్‌టైమ్ ఓటేస్తున్నాను. నిజానికి మా నాన్నతో కలిసి తొలిసారిగా ఓటు వేయాలని అనుకున్నా. కానీ కుదరలేదు. కోర్టు తీర్పును ఆయన అనుసరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి’’ అని బ్రాహ్మణి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment