సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వ్యతిరేకి అని, 40% కమిషన్ ప్రభుత్వమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు అణచివేతకు గురవుతున్నారని, వారిపై నేరాలు 50% పెరిగాయన్నారు. ఏ పని అయినా 40 శాతం కమిషన్ ముట్టజెప్పనిదే కావడం లేదని విమర్శించారు.
భారత్ జోడో యాత్ర 1,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంతో బళ్లారిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర బీజేపీ సర్కార్ ఎస్సై ఉద్యోగానికి రూ.80 లక్షలు వసూలు చేసింది, ఇలాంటి అవినీతి ప్రభుత్వం అవసరమా అని ప్రశ్నించారు. ‘రూ.80 లక్షలు ముట్టచెపితే మీరు పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ అవుతారు. మీ దగ్గర డబ్బుంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనుక్కోవచ్చు. డబ్బు లేని వాళ్లకు జీవితంలో ఉద్యోగం రాదు’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment