Bharat Jodo Yatra: Music Company Files Case Against Rahul Gandhi For Using KGF Song - Sakshi
Sakshi News home page

Bharat Jodo Yatra: రాహుల్‌ పాదయాత్రలో ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ నేతలపై కేసు నమోదు!

Published Sat, Nov 5 2022 2:57 PM | Last Updated on Sat, Nov 5 2022 3:26 PM

Case Against Rahul Gandhi Use Of KGF Songs In Bharat Jodo Yatra - Sakshi

దేశంలో మళ్లీ అధికారంలోని రావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్రను తలపెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్‌ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతోంది. రాహుల్‌ పాదయాత్రలో టీకాంగ్రెస్‌ నేతలు పాల్గొంటున్నారు.

ఇక, కర్నాటకలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ముగిసిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్‌ గాంధీపై కాపీరైట్‌ యాక్ట్‌ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోకు కేజీఎఫ్‌-2 పాటను కాంగ్రెస్‌ నేతలు వాడుకున్నారు. దీంతో, తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షెన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. 

అయితే, కర్నాటకలో రాహుల్‌ జోడోయాత్ర సందర్భంగా పాదయాత్ర ఫొటోలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్‌-2 హిందీ సినిమా పాటలు, సంగీతాన్ని వాడుకున్నారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్‌ఆర్‌టీ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండానే పాటలను వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. ఈ క్రమంలో కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్‌ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పై కేసు పెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement