
సదస్సులో మాట్లాడుతున్న మాళవిక
బళ్లారి (కర్ణాటక) : లైంగిక వేధింపులు, అత్యాచార సమయాల్లో మగాళ్లను చంపినా నేరం కాదని ప్రముఖ నటి మాళవిక అవినాష్ అన్నారు. బళ్లారిలోని గాంధీభవన్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘సబల శక్తి విద్యార్థిని' సదస్సులో ఆమె ప్రసంగించారు. మహిళలు, యువతులే కాకుండా చిన్నారులకూ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలు, వేధింపులకు పాల్పడే వారిపై 1886లో ఇంగ్లండ్ కోర్టు జారీ చేసిన సెక్షన్ 376 కింద శిక్ష అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆత్మరక్షణ కోసం ప్రతి విద్యార్థిని ఓ చిన్న కత్తిని ఉంచుకోవాలని సూచించారు. ఇరుగుపొరుగు ఇళ్లలో మహిళలపై వేధింపులు ఉంటే వెంటనే బాధితురాలి పక్షాన నిలిచి ఆదుకోవాలన్నారు. దేశంలో 40 లక్షల మంది మహిళలు అంతర్జాతీయ సెక్స్ మాఫియాలో బందీలయ్యారని మాళవిక ఆవేదన వ్యక్తం చేశారు.