సార్‌బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది.
ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్‌సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్‌పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment