బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం 75 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 21–16, 17–21తో మార్క్ కాలివు (నెదర్లాండ్స్) చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 22–24, 12–21తో సెలానీ–చెరిల్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment