బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అంతటా.. ఈ బిగ్ రియాల్టీ షోకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తెలుగులో అయితే ఈ షోకి ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా భాషల కంటే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. గత నాలుగు సీజన్ల టీఆర్పీ రేటింగ్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
తెలుగులో వచ్చిన నాలుగు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో ఐదో సీజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు. వాస్తవానికి బిగ్‌బాస్ ఐదో సీజన్ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే.. సెప్టెంబర్ 5న బిగ్‌బాస్ ఐదో సీజన్ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ లిస్ట్ నుంచి మంగ్లీ ఔట్ అయినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ షోకి వెళ్లడానికి మంగ్లీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తాజాగా ఆమె మనసు మార్చుకుందట. .ఇటీవల బోనాల పాటపై చేసుకొన్న వివాదంతో బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట. అయితే షో ప్రారంభంనాటికి ఎలాగైనా మంగ్లీని ఒప్పించి, తీసుకురావాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. ‘బిగ్‌బాస్’కోసం మంగ్లీ మళ్లీ మనసు మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment