టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీకి గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం బోనాలు జరుగుతున్న సందర్భంగా ఒక పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో మంగ్లీ విడుదల చేస్తుంది. అయితే ఆ పాటను షూట్ చేస్తున్న సమయంలో ఆమె కింద పడ్డారు. దీంతో ఆమె కాలికి స్వల్పంగా గాయమైనట్లు తెలుస్తోంది. వెంటనే యూనిట్ సభ్యులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలు కావడంతో మంగ్లీ త్వరగానే కోలుకుంటారని వైద్యులు తెలుపుతున్నారు.
(ఇదీ చదవండి: నాడు విజయ్ దేవరకొండ పేరుతో వైరల్.. నేడు లగ్జరీ కారుతో హీరోయిన్ ఇలా)
తెలంగాణ యాసలో పాటలు పాడుతూ.. బతుకమ్మ సాంగ్స్‌తో మంగ్లీ ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడం.. అందులో ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ కావడంతో మంగ్లీ ఇప్పుడు బిజీ సింగర్‌గా మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment