Singer Mangli Emotional Post On Oo Antava Oo Oo Antava Song Succes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష‍్ప: ది రైజ్' సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన వీడియోలు, పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రస్తుతం 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' సాంగ్ హవా నడుస్తోంది. సమంత స్పెషల్ సాంగ్ చేయడం ఒక కారణం అయితే, మత్తైన గాత్రం, లిరిక్స్ పాటను నెట్టింట్లో ట్రెండ్ అయేలా చేశాయి. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' అంటూ తన మత్తు వాయిస్‌తే అందరినీ కట్టిపడేసింది ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహన్.
పాటను మత్తుగా పాడటం ఒకెత్తు అయితే, లిరికల్ వీడియోలో ఇంద్రావతి చౌహన్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మరో ఎత్తు. ఈ సాంగ్‌తో ఇంద్రావతి క్రేజ్‌ఒక్కసారిగా హై అయింది. దీంతో ఈ ఇంద్రావతి ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు ప్రేక్షకులు. అయితే ఇంద్రావతి ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. చెల్లెలు ఇంద్రావతి సక్సెస్‌పై ఫుల్ కుషీగా ఉంది మంగ్లీ. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా అకౌంట్‌లో తన చెల్లెలి విజయం గురించి మంగ్లీ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
'నువ్ పాడిన 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' సాంగ్ నాలుగు రోజుల్లోనే 3 కోట్ల వ్యూస్‌ను రాబట్టి ఇంత పెద్ద విజయం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ ఇంద్రావతి చౌహన్. నీ డెబ్యూతోనే ఇంతటి సక్సెస్ అందుకున్నావ్. ఇక ముందు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలి. దేవీ శ్రీ ప్రసాద్, సుకుమార్ సర్, అల‍్లు అర్జున్ సర్, చంద్రబోస్ అన్న ఇలా అందరికీ థ్యాంక్యూ.' అని మంగ్లీ తన సంతోషాన్ని తెలియజేసింది. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన పుష్ప సినిమా ఈ నెల 17న ప్రేక్షకులను అలరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment