
‘ఊ అంటావా మావ.. ’ అంటూ ‘పుష్ప’లోని ప్రత్యేక పాటలో వీలైనంత గ్లామరస్‌గా కనిపించడంతో పాటు హాట్ స్టెప్స్‌తో, హాట్ హాట్ హావభావాలతో ఐటమ్ సాంగ్ లవర్స్‌ని ఆకట్టుకున్నారు సమంత. అయితే ఈ బ్యూటీ ఈ రేంజ్‌లో చేయడం చాలామందిని షాక్‌కి గురి చేసింది. ‘అవసరమా?’ అని చర్చించుకున్నవాళ్లూ ఉన్నారు. సమంత కూడా ఈ పాట చేసినప్పుడు చాలా అసౌకర్యంగా ఫీలయ్యారట. ఆ విషయం గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఊ అంటావా..’ పాట ఫస్ట్ షాట్ తీసేటప్పుడు భయంగా అనిపించింది. నా కాళ్లు వణికాయి.
నేను అంత అందంగా ఉండనని, కొందరు అమ్మాయిల్లా బాగుండననీ అనుకుంటుంటాను. దాంతో నాకు ‘ఊ అంటావా..’ పాట సవాల్‌లా అనిపించింది. అయితే సెక్సీగా కనిపించడం అనేది నా ఆలోచన కాదు కాబట్టి ఆ పాట చిత్రీకరణ అప్పుడు వణికిపోయాను. కానీ ఓ వ్యక్తిగా, నటిగా నాకు అసౌకర్యంగా అనిపించినవి, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం నుంచే నేను ఎదిగాను. ‘ఊ అంటావా..’ పాట నాకు సౌకర్యం కాదనిపించినా కొత్తగా ఏదైనా చేయాలని చేశాను. నిజానికి ఆ పాట లిరిక్స్ నాకు సవాల్‌గా అనిపించాయి. అమ్మాయిలంటే అందం మాత్రమే కాదనేలా ఆ పాట ఉంటుంది. అది నచ్చి చేశాను’’ అన్నారు. ఇకపై ఇలాంటి పాటలు చేస్తారా? అనే ప్రశ్నకు ‘‘లేదు.. ఎందుకంటే ఇలాంటి సవాళ్లను స్వీకరించాలనుకోవడంలేదు’’ అన్నారు సమంత. ఇక ప్రత్యేక పాటలకు సమంత ‘ఊహూ’ అంటారని స్పష్టమైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment