స్టేజ్‌పై 'సారంగదరియా' అంటూ సాయి పల్లవి స్టెప్పులు | Aamir Khan As Special Guest For Love Story Pre Release Event | Sakshi
Sakshi News home page

Love Story: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్టెప్పులేసిన సాయిపల్లవి

Published Sun, Sep 19 2021 6:53 PM | Last Updated on Sun, Sep 19 2021 8:39 PM

Aamir Khan As Special Guest For Love Story Pre Release Event - Sakshi

Aamir Khan As A Special Guest For Love Story Pre Release Event: నాగ చైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగ్లీ సారంగదరియా పాటను ఆలపించగా,సాయి పల్లవి స్టెప్పులతో హోరెత్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సుద్దాల అశోక్‌ తేజ లిరిక్స్‌ అందించిన ఈ పాట ఎంతలా ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

30 కోట్లకు పైగా వ్యూస్‌లో యూట్యూబ్‌ సెన్సేషన్‌ను క్రియేట్‌ చేసింది ఈ పాట. మంగ్లీ గాత్రంతో పాటు సాయిపల్లవి డ్యాన్స్‌ సారంగదరియాకు హైలెట్‌ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరంజీవి, అమీర్ ఖాన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement