
Chiranjeevi At Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.
'సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ చమత్కరించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు.
ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్‌కి కూల్ సన్' అని చిరు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్‌పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment