'లవ్​స్టోరీ' నన్ను మార్చేసింది: నాగ చైతన్య | Naga Chaitanya On Love story and Future Projects And More | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: 'నిజాయితీగా లేకుండా కమర్షియల్​ లెక్కల వెంట పరిగెత్తాను'

Published Thu, Sep 23 2021 7:59 PM | Last Updated on Thu, Sep 23 2021 8:50 PM

Naga Chaitanya On Love story and Future Projects And More - Sakshi

Naga Chaitanya About Love Story: నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఈ  సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పన్నేండేళ్ల వెండితెర ప్రయాణం తర్వాత తనలో వచ్చిన  మార్పులేంటి ? కథల ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఎలా ఉండబోతున్నాయి ?  లవ్​స్టోరీలో రేవంత్​గా తాను ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలపై పలు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

అప్పుడు తప్పు చేశాను
గతంలో  నా సినిమా ఒకటి హిట్​ అవగానే... దాని  తర్వాత వచ్చే సినిమా ఇంకా పెద్ద హిట్​ కావాలని  ఆలోచించే వాడిని.  దానికి తగ్గట్టుగా సినిమాకు మంచి ప్యాకేజీ రావాలని కోరుకునే వాడిని. అందులో భాగంగా మంచి​ కాంబినేషన్​, మంచి లోకేషన్లు, పాటలు,  పెద్ద ఫైట్లు అంటూ ఆలోచించే వాడిని.  ఇలా కమర్షియల్​ ఎలిమెంట్స్​ మీద ఎక్కువ కాన్​సన్​ట్రేట్​ చేశాను.  ఆ గిమ్మిక్కుల చుట్టూ తిరుగుతూ కథను పక్కన పెట్టాను. సినిమా పట్ల నిజాయితీగా లేకుండా కమర్షియల్​ లెక్కల వెంట పరిగెత్తాను. కొన్ని సార్లు ఈ లెక్కలు వర్కవుట్​ అవుతాయి, కొన్ని సార్లు కావు. నాకైతే  ఫ్లాప్స్​ ఎదురయ్యాయి. ఆ సమయంలో  సినిమా పట్ల,  తీసే కథ పట్ల హానెస్ట్​గా  ఉండాలని డిసైడ్​ అయ్యాను.

మజిలీతో మారిపోయింది
వరుస ప్లాప్స్​ తర్వాత లో కాన్ఫిడెన్స్​ లెవల్స్​లో ఉన్నాను. ఎలాంటి కథ ఎంచుకోవాలనే సందిగ్థదంలో ఉన్నప్పుడు మజిలీ వచ్చింది. కథతో ఎమోషనల్​ జర్నీ చేశాను.  కమర్షియల్​ ఎలిమెంట్స్​ కాకుండా కథే ముఖ్యమని ఆ సినిమా చేశాను.  నా జడ్జిమెంట్​కి అదొక లిట్మస్​ టెస్ట్​ అనుకున్నా.  రిజల్ట్​ బాగానే వచ్చింది.  

తాత, నాన్న గారే స్ఫూర్తి
మజిలీ తర్వాత నా పాత సినిమాలను ఒకసారి చూసుకుంటే చాలా సినిమాలో నేను, నాలా లేను. కెరీర్​ కొత్తలో మనం చాలా వింటాం. ప్రేక్షకులకు ఇది కావాలి, ఆ సెంటర్​ వాళ్లకి అది కావాలి, హీరో అంటే ఇలా ఉండాలి, ఫ్యాన్​ బేస్​ ఇలా చాలా ఉంటాయి.  వాటిని బట్టే ముందుకు వెళ్తాం. కానీ ఒకసారి  తాతాగారు, నాన్న​ కెరీర్​లో చేసిన సినిమాలు చూస్తే స్కిప్ట్​లో ఫ్రెష్​నెస్​ , కొత్తదనం ఉన్నాయి. అందువల్లే ప్రేక్షకులు వాళ్లని ఆదరించారని అర్థమైంది.

న్యూ పాయింట్​
ఫస్ట్​ శేఖర్​ కమ్ములతో సినిమా అనగానే  ఫిదా లాంటి ఎంటర్​టైనర్​ సినిమాలా ఉంటుందని అనుకున్నా. కానీ శేఖర్​ కమ్ముల  క్యాస్ట్​ , జెండర్​ వివక్ష మీద కథ చెప్పడంతో చాలా కొత్తగా అనిపించింది. ఈ ఇష్యూస్ మీద చాలా వార్తలు చదువుతున్నాం, కానీ సినిమాగా రావడం లేదు అనేది నా మైండ్‌లో ఉండేది.  శేఖర్​ అదే పాయింట్​పై కథ చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యాను.

రేవంత్​ అర్థం కావడానికి 
లవ్​స్టోరీలో రేవంత్​ క్యారెక్టర్​ నాకు చాలా కొత్త. ఈ సినిమాలో రేవంత్​ ఎదుర్కొన్న  కష్టాలేమీ నిజ జీవితంలో నాకు ఎదురుకాలేదు.  కానీ రేవంత్​ క్యారెక్టర్​ అలా కాదు. అతనికి ఉన్న ఇబ్బందులు, పరిమితులు గురించి శేఖర్​ టీమ్ చాలా డిటెయిల్డ్​గా వివరించారు. ఈ ప్రయాణం మూడు నెలలు జరిగింది. ఆ క్యారెక్టర్​లో డెప్త్​ అర్థమైన తర్వాత శేఖర్​ కోసం ఎలాగైనా రేవంత్​లా మారిపోవాలని డిసైడ్​ అయ్యాను. 

యాస పట్టుకోవడమే కష్టం
రేవంత్​ క్యారెక్టర్​ పట్టుకోవడం, అందులో జుంబా ఇన్​స్ట్రక్టర్​గా నటించడం కంటే తెలంగాణ యాసలో పర్​ఫెక్ట్​గా మాట్లాడం కష్టమనిపించింది. పద్దెనిమిదేళ్లు చెన్నైలో ఉండటం కొంతైతే, ఇక్కడ హైదరాబాద్​లో ఇంగ్లీష్​ కలిపిన తెలుగు మాట్లాడే ఫ్రెండ్స్​ ఎక్కువ. అయితే మధ్యలో కరోనా లాక్​డౌన్​ రావడంలో చాలా సమయం దొరికింది. అప్పుడు బాగా ప్రాక్టీస్​ చేశాను. పైగా డబ్బింగ్​కి ముందు సెకండ్​ వేవ్​ రావడంతో మరోసారి యాస మీద దృష్టి పెట్టాను.

షూటింగ్​ జరిగేప్పుడు
కొన్నేళ్ల పాటు ఓ తరహాలో నటించడానికి అలవాటయ్యాం. లార్జర్​ దాన్​ లైఫ్​ అన్నట్టుగానే హీరో క్యారెక్టర్లు చేశాను.  దీంతో లవ్​స్టోరీలో రేవంత్​గా కెమెరా ముందు ఉన్నప్పడు పాత ఛాయలు కనిపించగానే శేఖర్​ గారు వెంటనే చెప్పేవారు. డౌన్​ఇట్​ డౌన్​ ఇట్​ అని. సహాజంగా నటించమని చెప్పారు. ఓ పదిహేను రోజలు తర్వాత షూటింగ్​లో మ్యాజిక్​ స్టార్టయ్యింది. కెమెరా ఆన్ కాగానే చైతన్య పోయి పూర్తి రేవంత్​ వచ్చే వాడు.

లవ్​స్టోరీతో నన్ను మార్చేసింది
నాగచైతన్యగా నా లైఫ్​ వేరు, రేవంత్​ క్యారెక్టర్​ వేరు. ఈ సినిమా షూటింగ్​లో ఉన్నప్పుడే కరోనా వచ్చింది. లాక్​డౌన్​ వచ్చింది.  జీవితం అంటే ఎంటీ ? డబ్బు, హోదా, గ్యాడ్జెస్ట్​ ఇవేమీ కాదనిపించింది.  ఈ మార్పు రేవంత్​ క్యారెక్టర్​కే కాదు నా జీవితంలో కూడా మార్పు తెచ్చింది.

మార్పు వస్తోంది
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా మేకింగ్​, ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వస్తోంది. ఇకపై ఇటు సినిమాలు, అటు ఓటీటీలకు సమాన ప్రాధాన్యం ఇస్తాను.  అయితే కథకు, బౌండెడ్​ స్క్రిప్టు మాత్రం కంపల్సరీ. 

హిందిలో అలా జరిగిపోయింది
తెలుగు సినిమాలకే నా తొలి ప్రాధాన్యం. అయితే ఊహించని విధంగా అమీర్​ఖాన్​తో లాల్​సింగ్​ చద్ధాలో నటించే అవకాశం వచ్చింది. హిందీలోకి మంచి ఎంట్రీ వచ్చింది. చెన్నైలోనే పెరగడం వల్ల తమిళ భాష , తమిళ్​ సెన్సిబులిటీస్ మీద ఐడియా ఉంది.  ఓటీటీలో తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement