
Singer Mangli Mobbed By Fans In Ongole, Video Goes Viral: జానపద పాటలతో కెరీర్ ప్రారంభించిన మంగ్లీ.. తన పాటలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలి కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో సైతం మంగ్లీ పాట ఉండాల్సిందే అనేలా క్రేజ్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆమెకు సెల్ఫీల సెగ తగిలింది. ప్రోగ్రామ్ అనంతరం తిరిగి వెళ్తుండగా మంగ్లీతో ఫోటోలు దిగేందుకు కొందరు యువకులు ఎగబడ్డారు.
సెల్ఫీల కోసం ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అసహనానికి గురైన మంగ్లీ.. యువకుల తీరుతో ఇబ్బంది పడింది. కాగా ఇటీవలె పుష్ప సినిమాలో ఊ అంటావా మావ..ఊఊ అంటూవా పాటతో మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఒక్కసారిగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇదే పాటను మంగ్లీ కన్నడ వెర్షన్‌లో పాడి ఆకట్టుకుంది.