తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అవసరముంటే తప్పితే జనాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ వర్షం వల్ల గతవారం థియేటర్లలో రిలీజైన 'సరిపోదా శనివారం' సినిమాకు పెద్ద దెబ్బ పడింది. బాగుందనే టాక్ వచ్చినప్పటికీ వర్షం వల్ల కలెక్షన్స్ పడిపోయాయి. 5 రోజుల్లో రూ.65 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ భారీ విరాళం.. మీరు విన్నది నిజం కాదు!)
ఇలా వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షల రూపాయల్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుహాస్ హీరోగా దిల్ రాజు నిర్మాణ సంస్థ తీసిన 'జనక అయితే గనక' సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లెక్క ప్రకారం సెప్టెంబరు 7న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాలి. ముందు రోజు ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇంతలోనే మరోసారి తెలుగు రాష్ట్రాలకు వర్షం పోటెత్తనుందనే హెచ్చరిక వచ్చింది. 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడబోతున్నాయని అంటున్నారు. దీనిబట్టి చూస్తే వాయిదా వేసి మంచి పనే చేశారనిపిస్తోంది.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!)
Comments
Please login to add a commentAdd a comment