
చిన్న సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం చాలా కష్టం. ఎంత ప్రచారం చేసినా..కొన్ని చిన్న చిత్రాలు రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే మేకర్స్ డిఫరెంట్ వేలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రాంక్ వీడియోలు చేస్తూ..కాంట్రవర్సీ క్రియేట్ చేసి సినిమా పేరును ప్రేక్షకులను చేరవయ్యేలా చేస్తున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ కూడా డిఫరెంట్‌గానే ప్లాన్ చేస్తున్నారు. తాజాగా హీరో సుహాస్ తన కొత్త సినిమా ప్రచారం కోసం ఏకంగా దిల్ రాజు వాట్సాప్ చాట్‌నే బయటపెట్టాడు.
ప్రీమియర్ షో ఫిక్స్!
సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. సందీర్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. రిలీజ్‌కి ఒక రోజు ముందు అంటే.. సెప్టెంబర్ 6న ప్రీమియర్ షో వేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ..నిర్మాత దిల్ రాజుతో చేసిన వాట్సాప్ చాట్‌ని హీరో సుహాస్ బయటపెట్టాడు.
వాట్సాప్ చాట్‌లో ఏముందంటే..
సుహాస్: సర్ మనం ప్రీమియర్ షో వేస్తే బాగుంటుంది. ఈ మధ్య ప్రీమియర్స్ వేసిన సినిమాలన్నీ బాగా వర్కౌట్ అవుతున్నాయి.
దిల్ రాజు: చూడాలి సుహాస్. ఇప్పటికిప్పుడు అంటే ప్లాన్ చేయాలి. చెక్ చేసి చెబుతా.
సుహాస్: ఈ నెల 6న సాయంత్రం ఏఎంబీ, నెక్సెస్ ఇలా అన్ని ఓపెన్ చేద్దాం సర్.
దిల్ రాజు: కొంచెం టైమ్ ఇవ్వు సుహాస్.. చెప్తా.
సుహాస్: వాయిస్ రికార్డు
దిల్ రాజు: 6న కన్ఫామ్ సుహాస్. ప్రీమియర్స్ వేసేద్దాం
సుహాస్: క్లాప్ కొడుతున్న ఎమోజీ
That's how @ThisIsDSP Garu helped us 🤗❤️#JanakaAitheGanaka premieres on September 6th 🤗#JAGOnSeptember7th pic.twitter.com/i1Kog2gh2y
— Suhas 📸 (@ActorSuhas) September 3, 2024