
తెలుగు రాష్ట్రాల్ని వరదలు అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా విజయవాడ, ఖమ్మంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు చాలామంది తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు స్టార్ హీరోలు చాలామంది లక్షలాది రూపాయల్ని విరాళంగా ప్రకటించారు. ప్రకటిస్తూనే ఉన్నారు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)
ఈ క్రమంలోనే హీరో ప్రభాస్.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళమిచ్చాడనే వార్త ఒకటి వచ్చింది. ఇందులో నిజం ఏ మాత్రం లేదని తేలింది. ప్రభాస్ ఎంత ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది. సో అప్పటివరకు కాస్త ఆగడం బెటర్.
ఇకపోతే చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కి తలో రూ.50 లక్షలు చొప్పున విరాళమందించారు. హీరో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనన్య నాగళ్ల తదితరులు తమకు తోచిన సాయం చేశారు. సామాన్యులు కూడా తమకు వీలైనంత ఆర్థిక సాయం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం)