ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మెరుస్తున్న మరో ముత్యం సంకీర్తనా విపిన్! ముందు వెబ్‌తెరకు పరిచమై తర్వాత వెండితెరను మురిపిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆమె గురించి కొన్ని వివరాలు..
👉 సంకీర్తనా విపిన్.. సొంతూరు కేరళలోని నీలేశ్వర్ పట్టణం. తల్లిదండ్రులు సీమ, విపిన్‌లు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసింది.
👉 కిందటేడు ‘నరకాసుర’తో చిత్రరంగ ప్రవేశమూ చేసింది. ఆ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా ఆమె నటనకు మాత్రం ప్రశంసలు అందాయి. ఆమె ప్రతిభను తెలుగు చిత్ర పరిశ్రమా గుర్తించి ‘ఆపరేషన్ రావణ్’తో తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసింది. అదీ పెద్దగా ఆడకపోయినా అవకాశాలు ఆగలేదు. ‘జనక అయితే గనక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించింది. మంచి సినిమా అనే టాక్‌ను సొంతం చేసుకున్న ఆ చిత్రం.. సంకీర్తనకూ మంచి పేరే తెచ్చిపెట్టింది. అదిప్పుడు ‘ఆహా’లో స్ట్రీమ్ అవుతోంది.
👉 చిత్రకళ, ప్రయాణాల పట్లా సంకీర్తనకు మక్కువ ఎక్కువే! బీబీఏలో ఆమె ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ట్రావెల్ అండ్ టూరిజమే! ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యాగ్ సర్దేస్తుంది. ఏ మాత్రం స్ట్రెస్ అనిపించినా కుంచె పట్టేస్తుంది.
👉 చిన్నప్పటి నుంచీ సినిమాలు అంటే ఇష్టం. అలాగని చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ఆడిషన్స్‌కు వెళ్లేది. అలా మలయాళం వెబ్ సిరీస్ ‘ఒరు వడక్కన్ కేట్టుకథ’తో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
👉 మాతృభాష మలయాళంలోనూ ఆమెకు చాన్సెస్ వస్తున్నాయి. ఆ జాబితాలోనివే ‘హిగుయిటా’, ‘కాడువెట్టి’ చిత్రాలు. ‘అసురగణ రుద్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
👉 సినిమా ఫ్లాప్ అయిన ప్రతిసారి ‘ఇది నీకు సెట్ కాదు’ , ‘వేరే ప్రొఫెషన్ చూసుకో’ అంటూ నెగటివ్ కామెంట్స్‌తో వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. నేను అవేమీ పట్టించుకోను. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువే. నా టాలెంట్ మీద నమ్మకమూ జాస్తి!
– సంకీర్తనా విపిన్
Comments
Please login to add a commentAdd a comment