నిర్మాతకు పొగరు ఉండాలి | Producer should have proud says R Sundarrajan | Sakshi
Sakshi News home page

నిర్మాతకు పొగరు ఉండాలి

Published Tue, Dec 30 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

నిర్మాతకు పొగరు ఉండాలి

నిర్మాతకు పొగరు ఉండాలి

తమిళసినిమా: నిర్మాత అనే వాడికి పొగరు ఉండాలని సీనియర్ దర్శక నటుడు ఆర్.సుందరరాజన్ అన్నారు. వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న చిత్రం కంగారు. వివాదస్పద చిత్రాల దర్శకుడిగా పేరొందిన సామి దర్శకత్వం వహిస్తూ, నవ నటుడు అర్జునా, ప్రియాంక, కోమల్ శర్మ నాయికా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నగరంలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర దర్శకుడు సామి మాట్లాడుతూ నాలుగేళ్ల తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం కంగారు అని తెలిపారు.
 
 తన గత చిత్రాలు వేరే విధంగా ఉండడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. ఒక చిత్రం ఎలా ఉండాలన్నది ఒక వ్యక్తి నిర్ణయించలేదన్నారు. దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు ఇలా అందరూ కలసి నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే చిత్రం విజయం సాధిస్తే అందరూ భాగం పంచుకుంటారన్నారు. అపజయాలకు దర్శకుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తారని, ఇదెక్కడి న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కంగారు చిత్రం విషయానికొస్తే తన శిష్యుడు సాయి ప్రసాద్ చెప్పిన కథతో తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. తమిళ సినిమాలు గుర్తుండిపోయే చిత్రంగా ఉంటుందన్నారు. వైరముత్తు రాసిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా ఉంటాయని ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను విడుదల చేయనున్నారని వెల్లడించారు.
 
 ఏమిటి దుస్థితి : చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ ఈ కంగారు చిత్రాన్ని చాలాకాలం మోసుకుంటూ వస్తున్నానన్నారు. ఇది తనకు చాలా నేర్పిందన్నారు. ఇతర వృత్తుల్లో యాజమాన్యం కార్మికులను కట్టడి చేస్తుంటే సినిమాలో మాత్రం కార్మికులు  నిర్మాతలను కట్టడి చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన దర్శక, నటుడు ఆర్.సుందరరాజన్ మాట్లాడుతూ, ఒకసారి సంగీత దర్శకుడు ఇళయరాజా ఏడు పాటలు కంపోజ్ చేసి అవన్నీ ఒకే చిత్రానికి అందిస్తానన్నారు. కొందరు నిర్మాతలు నాలుగైదు పాటలు చాలంటే, అలాగైతే తన పాటలు ఇవ్వనని చెప్పారు. ఒక సంగీత దర్శకుడికే అంత పొగరు ఉంటే రచయితగా తనకెంత పొగరుండాలని ఆయన పాటలు విందాం అనుకుని విన్నానన్నారు. ఆ తరువాత ఆ పాటలన్నీ తానే తీసుకుని వైదేహి కాత్తిరుందాల్ చిత్రంకు వాడుకున్నానన్నారు. ప్రతిభ పొగరంటే అలా ఉంటుందన్నారు. అలాగే నిర్మాతలకు పొగరు, ఐక్యతా భావం ఉండాలన్నారు. లేకుంటే ఎవరూ విలువనివ్వరని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement