పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం | pawan kalyan vehical hits convoy | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం

Published Fri, Oct 17 2014 1:27 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం - Sakshi

పవన్ కళ్యాణ్కు తప్పిన ప్రమాదం

ఖమ్మం : సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కొణిజర్ల వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ వాహనం ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో ఆయన మరో కారులో ఖమ్మం బయల్దేరి వెళ్లారు.  బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న శ్రీజ అనే పదమూడేళ్ళ చిన్నారిని పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

 

కాగా శ్రీజకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. అభిమాన నటుడిని  చూడాలని ఆమె ఆకాంక్ష. అయితే ఆమె ప్రస్తుతం ఖమ్మంలోని కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీజ కదలలేని పరిస్థితిలో ఉండటంతో మేక్ ఏ విష్ స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తితో ఆమెను చూసేందుకు పవన్ కళ్యాణే  ఖమ్మం వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను ఆయన పరామర్శించి ఆమె కోరికను తీర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement