శ్రీజకు రెండు లక్షలు, బొమ్మలు ఇచ్చిన పవన్
హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ (13)ను సినీనటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మం కార్తీక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పవన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి ఆస్పత్రిలోని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా శ్రీజకు రూ.2లక్షల చెక్కుతో పాటు, బొమ్మలను అందచేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయల్దేరారు.
విశాఖలో తుఫాను బాధితులను పరామర్శించిన అనంతరం హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో ఖమ్మం వెళ్లి, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పవన్ పరామర్శించారు. తనకు పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని శ్రీజ చెప్పడంతో మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు పవన్ కు సమాచారం అందించి ఆమె కోరిక తీర్చారు.