
పుణే: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) యూత్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. పుణే ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తరఫున బరిలోకి దిగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీజ 11–7, 5–11, 11–9, 12–14, 11–9, 9–11, 12–10తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రాప్తి సేన్‌పై గెలుపొందింది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శ్రీజ 4–2తో సురభి పట్వారి (పశ్చిమ బెంగాల్)పై, క్వార్టర్ ఫైనల్లో 4–3తో బైశ్య పోయమంటిని (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించింది. 20 ఏళ్ల శ్రీజ హైదరాబాద్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ)లో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ వద్ద శిక్షణ తీసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment