పేరు మారింది మరి ఫేట్? | Numerology work out for srija! | Sakshi
Sakshi News home page

పేరు మారింది మరి ఫేట్?

May 7 2016 4:03 AM | Updated on Sep 3 2017 11:32 PM

పేరు మారింది మరి ఫేట్?

పేరు మారింది మరి ఫేట్?

సెంటిమెంట్ చాలా చేయిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువేనని చెప్పక తప్పదు. న్యూమరాలజీని బాగానే నమ్ముతారు.

సెంటిమెంట్ చాలా చేయిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువేనని చెప్పక తప్పదు. న్యూమరాలజీని బాగానే నమ్ముతారు.దానిని బట్టి తారలు పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాటే.తద్వారా ఎవరు ఎలాంటి ఫలితాలను పొందారన్నది పక్కన పెడితే ఈ పేర్ల మార్పుల పరంపర కొనసాగుతూనే ఉంది.ఆ మధ్య నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్‌లక్ష్మీగా మార్చుకున్నారు.తాజాగా వర్ధమాన నటి శ్రీప్రియాంక శ్రీజగా పేరు మార్చుకున్నారట. ఇటీవల తమిళ భాష తెలిసిన నటీమణులకు ఇక్కడ అవకాశాలు లేవు అంటూ ఒక వేదికపై తన ఆవేదనను వ్యక్తం చేసి నలుగురి దృష్టిలో పడ్డ ఈ అమ్మడు పుదుచ్చేరికి చెందిన అచ్చమైన తమిళ అమ్మాయి.

కంగారు చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన శ్రీప్రియాంక ఆ తరువాత వందామల, కోడైమళై  చిత్రాల్లో నటించింది. తాజా చిత్రం సారల్ విడుదలకు ముస్తాబవుతోంది. అయితే నాయకిగా తగిన గుర్తింపు కోసం పోరాడుతున్న శ్రీప్రియాంక తన పేరును శ్రీజగా మార్చుకోవడానికి కారణాన్ని తెలుపుతూ శ్రీప్రియాంక పేరుతో ఇప్పటికే ఇక్కడ ఇంకొందరు నటీమణులు ఉన్నట్లు ఇటీవలే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. పేరుతో కన్‌ఫ్యూజన్ ఉండరాదనే శ్రీజగా మార్చుకున్నట్లు వివరించారు. అయితే న్యూమరాలజీ ప్రకారం శ్రీజ పేరు తనకు భాగుంటుందన్నారని అసలు సంగతిని మెల్లగా చెప్పింది. తాను నటించిన సారల్ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అంది.

ప్రస్తుతం రింగారం అనే చిత్రంలో నటిస్తున్నానని, తిరుపతి లడ్డు అనే మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పింది. మరి కొన్ని నూతన చిత్రాలను అంగీకరించే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు శ్రీజగా మారిన శ్రీప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ఈ కొత్త పేరు అయినా తనకు మంచి అవకాశాలు తెచ్చి పెట్టి తన ఫేట్‌ను మారుస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement