జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో కళామందిర్ రాయల్ చీరల షోరూం సోమవారం ప్రారంభమైంది. సినీ నటి అమల అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో లగడపాటి పద్మ, ఫిక్కీ చైర్మన్ సుబ్రా మహేశ్వరి, కళామందిర్ సుమజ, ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ దివ్యారెడ్డి, ఎండి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది 49వ స్టోర్ అని తమ వద్ద ప్రత్యేకమైన పైతాని, సిల్క్, కోట, పటోల, హ్యాండ్లూమ్, ఖాదీ చీరలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చీర కట్టులోనే మహిళల ఔన్నత్యం దాగి ఉంటుందన్నారు. చీర కట్టడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఎన్నో డిజైనరీ బ్రాండ్లు కనువిందు చేస్తున్నాయన్నారు.