kalamandir
-
కళామందిర్ ఫౌండేషన్ డే వేడుకలో ప్రముఖుల సందడి.. (ఫోటోలు)
-
కళామందిర్ సంస్థలో కొనసాగుతున్న ఐటీ సోదాలు
-
కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
షోరూం ప్రారంభోత్సవంలో మెగా డాటర్స్, అమల సందడి.. ఫొటోలు వైరల్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో కళామందిర్ రాయల్ చీరల షోరూం సోమవారం ప్రారంభమైంది. సినీ నటి అమల అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో లగడపాటి పద్మ, ఫిక్కీ చైర్మన్ సుబ్రా మహేశ్వరి, కళామందిర్ సుమజ, ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ దివ్యారెడ్డి, ఎండి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 49వ స్టోర్ అని తమ వద్ద ప్రత్యేకమైన పైతాని, సిల్క్, కోట, పటోల, హ్యాండ్లూమ్, ఖాదీ చీరలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చీర కట్టులోనే మహిళల ఔన్నత్యం దాగి ఉంటుందన్నారు. చీర కట్టడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఎన్నో డిజైనరీ బ్రాండ్లు కనువిందు చేస్తున్నాయన్నారు. -
కళామందిర్‌కు కన్నమేశాడు
సాక్షి, హైదరాబాద్: తాను పని చేస్తున్న షాపింగ్మాల్కే కన్నమేశాడు ఓ సెక్యూరిటీ గార్డ్. ఆ సంస్థకు రక్షణ కల్పించాల్సింది పోయి సుమారు రూ. 9 లక్షలు దొంగిలించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేసన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ నర్సింగరావు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్ వస్త్ర దుకాణంలో నాలుగేళ్లుగా అస్సాంకు చెందిన మోనీదాస్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సంస్థ నిర్వాహకులు అతనిపై నమ్మకంతో షాపింగ్ మాల్ తెరవడం, మూసే బాధ్యతలు అప్పగించారు. ఇదే అదనుగా చేసుకున్న మోనీదాస్ లాకర్‌కు మారుతాళం చేయించాడు. శనివారం తాళాలు వేసిన మోనీదాస్ అసలైన తాళం తీసుకొని, మారు తాళాన్ని మేనేజర్‌కు అందజేశాడు. ఆదివారం లాకర్ తీస్తుండగా ఎంతకూ రాకపోవడంతో ఆరా తీయగా నకిలీతాళం అని తేలింది. అయితే.. అదేరోజు మోనీదాస్ సైతం విధులకు హాజరు కాకపోవటంతో అనుమానం తలెత్తింది. మరో తాళం తెప్పించి లాకర్లో చూడగా రూ. 9 లక్షలు పోయినట్లు గుర్తించారు. సమీపంలోని అతని ఇంటికెళ్లి చూడగా అప్పటికే భార్యా పిల్లలతో పరారైనట్లుగా గుర్తించారు. ఈ పని మోనీదాస్దేనని భావించి పోలీసులకు సమాచారం అందజేశారు. మేనేజర్ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటితాళం పగలగొట్టి.. ఇంటి తాళం పగలగొట్టి నగదు అపహరించిన ఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. బాలాజీనగర్ సాయిరాం ఎన్‌క్లేవ్‌లో నివాసముండే సురేష్ నెలక్రితం వైజాగ్‌కు వెళ్లాడు. ఆదివారం రాత్రి ఇంటి తాళం పగలగొట్టి బంగారం గొలుసు, ఓ ఉంగరం దొంగిలించారు. సమాచారం అందుకున్న సురేష్ వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని.. -
'యాంటీ డ్రగ్స్ వాక్'లో అనసూయ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను డ్రగ్స్ కేసు ఒక్క కుదుపుకు గురిచేసింది. ఏమీడియాలో చూసినా డ్రగ్స్ కేసు గురించే చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. 12 మంది సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. మెత్తం 12 మందికి స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) నోటీసులు జారీ చేయడం, ఒక్కో రోజు ఒక్కోక్కరిని విచారిస్తుండడం ఇండస్ట్రీలో అలజడి రేపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో డ్రగ్స్-అనర్థాలపై అవగాహన కలిగించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవి నిర్వహించే కార్యక్రమాల్లో ప్రముఖ సినీ నటులు పాల్గొని తమ మద్దతు తెలియచేస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కళామందిర్ ఫౌండేషన్, హైదరాబాద్ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘యాంటీ డ్రగ్ వాక్’ను నిర్వహించనున్నారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడేందుకు, ఈకార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చింది. ‘డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం రండి’ అంటూ అనసూయ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. #sayNOtoDrugs pic.twitter.com/08STS7i7wg — Anasuya Bharadwaj (@anusuyakhasba) July 23, 2017 -
వెడ్డింగ్ ఫ్యాషన్
-
జోరందుకున్న సంక్రాంతి కొనుగోళ్లు
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో మార్కెట్లు సంక్రాంతి పండగ శోభను సంతరించుకున్నాయి. వస్త్రాల కొనుగోళ్లు రెండు రోజులుగా ముమ్మరమయ్యాయి. కోస్తా జిల్లాల్లో సంక్రాంతి అంటే కొత్త దుస్తులు ధరించాల్సిందే. ఈ సంవత్సరం పండగకు ముందే కళామందిర్, శ్రీనికేతన్ వంటి కార్పొరేట్ వస్త్రవ్యాపార సంస్థలు రాజమండ్రి, కాకినాడల్లో షోరూమ్‌లు ప్రారంభించాయి. ఇక హోల్‌సేల్ వస్త్రవ్యాపారానికి పేరొందిన రాజమండ్రి, ద్వారపూడిలలో అమ్మకాలు జోరందుకున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు కొత్త సరుకును రప్పిస్తున్నారు. రాజమండ్రిలో 800, ద్వారపూడిలో 600 హోల్ సేల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఈ దుకాణాల్లో సుమారు రూ.కోటిన్నర వ్యాపారం జరుగుతుండగా పండగ సీజన్లో రోజుకు సగటున రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వ్యాపారం సాగుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల రిటైల్ వస్త్ర దుకాణాలు ఉన్నాయి. వీటిలో మామూలు రోజుల్లో సుమారు రూ.పది కోట్ల వరకూ వ్యాపారం జరుగుతుందని, పండగ సీజన్లో అది రూ.35 కోట్లకు పైబడి ఉంటుందని వాపార వర్గాలు చెపుతున్నాయి. క్రిస్మస్ పండగతో డిసెంబర్ 15 నుంచి ఊపందుకునే అమ్మకాలు సంక్రాంతి ముందు తారస్థాయికి చేరతాయంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా పండగ కొనుగోళ్లకు రాజమండ్రి వస్తుంటారు. దీంతో రాజమండ్రి మార్కెట్లు కళకళలాడుతున్నాయి. తాడితోట, మెయిన్ రోడ్లలో ఈ సందడి అధికంగా కనిపిస్తోంది. కాగా కాకినాడలో, కోనసీమ కేంద్రం అమలాపురంలో కూడా నాలుగు రోజులుగా పండగ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పండగ సీజన్ మొత్తమ్మీద జిల్లాలో కే వలం వస్త్ర వ్యాపారమే రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు జరుగుతుందని అంచనా. కాగా జిల్లాలో ఈ ఏడాది వస్త్ర వ్యాపారంలో 30 శాతానికి పైగా కార్పొరేట్ దుకాణాలే దక్కించుకోనున్నట్టు అంచనా. వందలాదిగా వెలసిన ఫుట్‌పాత్ షాపులు రాజమండ్రి, కాకినాడల్లో ఫుట్‌పాత్‌లపై దుస్తులు, ఫాన్సీ వస్తువులు అమ్మేవారికీ పండగతో అమ్మకాలు పెరిగాయి. బెంగాల్ కాటన్, పంజాబీ డ్రెస్సులు, రెడీమేడ్ దుస్తుల వంటివి విక్రయించే ఫుట్‌పాత్ షాపులు వందలాదిగా వెలశాయి. రాజమండ్రి, కాకినాడల్లో పండగ సీజన్లో ఫుట్‌పాత్ వ్యాపారం రోజుకు రూ.20 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఉంటుందని అంచనా. కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారాలకు కూడా జిల్లావ్యాప్తంగా గిరాకీ పెరిగింది. మామూలు రోజుల్లో కిరాణా వ్యాపారం రోజుకు రూ.60 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉంటుంది. క్రిస్మస్ లగాయతు సంక్రాంతి వరకూ ఇళ్లల్లో పిండి వంటలు ఎక్కువగా వండుతుంటారు. దుకాణాల్లో స్వీట్ల తయారీ కూడా రెట్టింపవుతుంది. వంటనూనెలు, పప్పు ధాన్యాలు, పంచదార వినియోగం పండగ సీజన్లో ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కాగా పండుగ సీజన్లో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం రూ.500 కోట్ల నుంచి రూ.750 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ధగధగలాడని పసిడి వ్యాపారం కాగా బంగారం అమ్మకాలు మామూలు రోజులతో పోలిస్తే 15 నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ఈ సారి బంగారం ధర కూడా నిలకడగా ఉండడంతో జనం కొనుగోళ్లపై తాపీగా వ్యవహరిస్తున్నారు. 2012లో ఇదే కాలంలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2580 ఉండగా 24 క్యారట్ల బంగారం రూ.2820 ఉంది. 2013 జనవరిలో 22 క్యారట్ల బంగారం గ్రాము రూ.2839 ఉంటే 24 క్యారట్ల బంగారం రూ.3036 పలికింది. ప్రస్తుతం ఆ ధరలు రూ. 2770, రూ.2928 గా కొనసాగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధర తక్కువగా ఉన్నా సంక్రాంతికి జనం బంగారంపై కన్నా వస్త్రాల పైనే మక్కువ చూపుతారని వ్యాపారులు అంటున్నారు.