ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో మూడు నెలల గర్భిణి మృత్యువాత పడిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివలింగు శ్రీజ(32) సోఫీనగర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని భర్త వీరేన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. ఈదుగాంలోని గోల్డెన్ ఫంక్షన్‌హాల్ వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది.
ఈ ప్రమాదంలో శ్రీజ బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడగా తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. కాగా శ్రీజకు ఓ కుమార్తె (5) ఉండగా, ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కాలేజీకి వెళ్తానని చెప్పి శ్రీజ శవమై ఇంటికి రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment