చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ? | is he chiranjeev's soninlaw..have a look | Sakshi
Sakshi News home page

చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?

Published Wed, Feb 17 2016 11:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?

చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?

హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి కబుర్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. దీనిపై  చిరంజీవి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో  ప్రేమ వివాహం,  విడాకులతో సంచలన వార్తగా నిలిచిన శ్రీజ.. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి కట్టుతో ఉన్న ఫొటో ఒకటి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి చిన్న అల్లుడు ఈయనే అంటూ మరో  ఫొటోఒకటి ఇప్పుడు ఆందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
 
చిరంజీవి భార్య సురేఖకు సన్నిహితుల కొడుకు, తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కళ్యాణ్‌తో  పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఏ హంగూ, ఆర్భాటం లేకుండా, చాలా నిరాడంబరంగా  కొద్దిమంది విశిష్ట అతిథుల సమక్షంలో ఈ పెళ్లి చేయించేందుకు ఇరు  కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొణిదల వారి ఇంటి పెళ్లిసందడిపై... స్వయంగా పెళ్లివారి నుంచి  కబురు అందేవరకు ఈ సస్పెన్స్ తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement