Wedding Preparation
-
ప్లాన్ ఎ.. ప్లాన్ బి.. ప్లాన్ సి!
ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయడానికి రానా రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న జరగనుంది. పెళ్లి సంబరాలు మూడు రోజులు జరుగుతాయని తెలుస్తోంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు వధూవరుల కుటుంబ సభ్యులు. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా, మిహికాల పెళ్లి జరగబోతోంది. ‘‘పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరుగుతాయి. పెళ్లికి 80 నుంచి 100 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. కానీ ఆగస్టు సమయానికి పరిస్థితులు మారిపోవచ్చు. ప్రభుత్వ నియమాల్లో కొన్ని సడలింపులు ఉండవచ్చు. అలా జరిగినట్లయితే విదేశాల్లో ఉన్న మా బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెడ్డింగ్ థీమ్, డెకరేషన్ వంటి వాటిపై వర్క్ జరుగుతోంది. కానీ కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్ ఎ, ప్లాన్ బి, ప్లాన్ సీలను రెడీ చేస్తున్నాం’’ అని మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్ పేర్కొన్నారు. -
చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి కబుర్లు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. దీనిపై చిరంజీవి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రేమ వివాహం, విడాకులతో సంచలన వార్తగా నిలిచిన శ్రీజ.. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి కట్టుతో ఉన్న ఫొటో ఒకటి హల్చల్ చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి చిన్న అల్లుడు ఈయనే అంటూ మరో ఫొటోఒకటి ఇప్పుడు ఆందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చిరంజీవి భార్య సురేఖకు సన్నిహితుల కొడుకు, తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కళ్యాణ్‌తో పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఏ హంగూ, ఆర్భాటం లేకుండా, చాలా నిరాడంబరంగా కొద్దిమంది విశిష్ట అతిథుల సమక్షంలో ఈ పెళ్లి చేయించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొణిదల వారి ఇంటి పెళ్లిసందడిపై... స్వయంగా పెళ్లివారి నుంచి కబురు అందేవరకు ఈ సస్పెన్స్ తప్పదు. -
చిరంజీవి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు మళ్లీ వివాహం ఖరారైందనే వార్త ఇటీవల కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. దీని గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇప్పటి దాకా రాలేదు. గతంలో శ్రీజ ప్రేమ వివాహం, తదనంతర పరిణామాల్లో విడాకులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ, చిరంజీవి ఇంట పెళ్లి సందడి మొదలైందని భోగట్టా. వివాహ వేడుకలకు నాందిగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్న ఓ ఫొటో స్పష్టం చేసింది. కాగా, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వరుడు తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కుర్రాడు. చిరంజీవి సతీమణి సురేఖకు సన్నిహితులైనవారి కుమారుడు. ఇరు కుటుంబా లకూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి జరగనుందట. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ఈ పెళ్ళి జరపాలని వధూ వరుల కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్ళి కూడా హైదరాబాద్‌లో కాక, వేరే చోట జరపనున్నారు.