
మిహికా బజాజ్, రానా
ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయడానికి రానా రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న జరగనుంది. పెళ్లి సంబరాలు మూడు రోజులు జరుగుతాయని తెలుస్తోంది. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను ప్లాన్ చేస్తున్నారు వధూవరుల కుటుంబ సభ్యులు. అతి కొద్దిమంది స్నేహితులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో రానా, మిహికాల పెళ్లి జరగబోతోంది. ‘‘పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే జరుగుతాయి.
పెళ్లికి 80 నుంచి 100 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. కానీ ఆగస్టు సమయానికి పరిస్థితులు మారిపోవచ్చు. ప్రభుత్వ నియమాల్లో కొన్ని సడలింపులు ఉండవచ్చు. అలా జరిగినట్లయితే విదేశాల్లో ఉన్న మా బంధుమిత్రులు ఈ వివాహ వేడుకకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వెడ్డింగ్ థీమ్, డెకరేషన్ వంటి వాటిపై వర్క్ జరుగుతోంది. కానీ కరోనా నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెళ్లికి సంబంధించి ప్రభుత్వ నియమాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే మా ప్రయత్నంలో భాగంగా మేం ప్లాన్ ఎ, ప్లాన్ బి, ప్లాన్ సీలను రెడీ చేస్తున్నాం’’ అని మిహికా బజాజ్ తల్లి బంటీ బజాజ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment