దుర్గమ్మ సన్నిధిలో శ్రీజ దంపతులు
చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్‌తో శ్రీజ పెళ్లి మార్చి 28న జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చిన ఈ కొత్త దంపతులు అమ్మవారిని, స్వామిని కూడా దర్శించుకున్నారు.